
Tower of Babel in Telugu (తెలుగు)
- భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
- వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
- మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
- మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
- యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
- అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
- గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
- ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
- దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
You can also see the above text as an image
if it doesn't display correctly in your browser.
Transliteration
- Bhūmiyaṅdaṅtaṭa okka bhāṣayu okka palukunu uṅḍenu.
- Vāru tūrpuna prayāṇamai pōvucuṅḍagā ṣīnāru dēśamaṅdoka maidānamu vāriki kanabaḍenu. Akkaḍa vāru nivasiṅci
- Manamu iṭikalu cēsi bāgugā kālcudamu raṅḍani okanitō okaḍu māṭalāḍukoniri. Rāḷlaku pratigā iṭikalunu, aḍusunaku pratigā maṭṭikīlunu vārikuṅḍenu.
- Mariyu vārumanamu bhūmiyaṅdaṅtaṭa cediripōkuṅḍa oka paṭṭaṇamunu ākāśamunaṅṭu śikharamu gala oka gōpuramunu kaṭṭukoni, pēru saṅpādiṅcukoṅdamu raṅḍani māṭalāḍukonagā
- Yehōvā narula kumārulu kaṭṭina paṭṭaṇamunu gōpuramunu cūḍa digi vaccenu.
- Appuḍu yehōvāidigō janamu okkaṭē; vārikaṅdariki bhāṣa okkaṭē; vāru ī pani āraṅbhiṅci yunnāru. Ikamīdaṭa vāru cēya dalacu ēpani yainanu cēyakuṅḍa vāriki āṭaṅkamēmiyu nuṅḍada
- Ganuka manamu digipōyi vārilō okani māṭa okaniki teliyakuṅḍa akkaḍa vāri bhāṣanu tārumāru cēyudamu raṅḍani anukonenu.
- Ālāgu yehōvā akkaḍa nuṅḍi bhūmiyaṅdaṅtaṭa vārini cedaragoṭṭenu ganuka vāru ā paṭṭaṇamunu kaṭṭuṭa māniri.
- Dāniki bābelu anu pēru peṭṭiri; eṅdu kanagā akkaḍa yehōvā bhūjanulaṅdari bhāṣanu tārumārucēsenu. akkaḍa nuṅḍi yehōvā bhūmiyaṅdaṅtaṭa vārini cedaragoṭṭenu.
Information about Telugu |
Useful phrases in Telugu |
Numbers in Telugu |
Tower of Babel in Telugu
Telugu Translation

of names and phrases
Tower of Babel in other Dravidian languages
Kannada,
Malayalam,
Tamil,
Telugu
Other Tower of Babel translations
By language |
By language family
Learn Chinese Characters with the Omniglot Chinese app